తాడేపల్లి : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతం కావడంపై సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇస్రో శాస్త్రవేత్తలకు సీఎం జగన్ అభినందనలు తెలిపారు.భవిష్యత్తులో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
కాగా, శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఇస్రో ప్రవేశపెట్టిన పీఎస్‌ఎల్వీ సీ54 విజయవంతమైంది. ఈఓఎస్ 06, ఎనిమిది చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి తీసుకెళ్లేందుకు దీనిని ప్రయోగించారు.సముద్రాలపై వాతావరణాన్ని అధ్యయనం చేసేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఈ ప్రయోగం ద్వారా భారత్‌కు చెందిన 1,117 కేజీల బరువున్న ఈఓఎస్ 06, అలాగే 18.28 కేజీల బరువున్న ఐఎన్‌ఎస్ 2బీ, 16.15 కిలోల బరువున్న ఆనంద్, 1.45 కిలోల బరువున్న రెండు థాయ్ బోల్ట్ షాటిలైట్స్‌తో పాటు.. 17.92 కేజీల బరువున్న 4 యూఎస్‌కు చెందిన యాస్ట్రో కాట్ ఉపగ్రహాలను నింగిలోకి పంపారు. శ్రీహరికోట అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఇది 87వ ప్రయోగం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment