ఫండే
ఘనాంకాలు
దానిమ్మపండు నిండా ఉండే గింజలు పోషకాలతో నిండి ఉంటాయి. దానిమ్మ ఉత్పాదనలో మన భారతదేశం అగ్రస్థానంలో నిలుస్తోంది. దానిమ్మ విశేషాలను గణాంకాల్లో చూద్దాం...
దానిమ్మపండ్లు దాదాపు ప్రపంచవ్యాప్తంగా దొరుకుతాయి. ఇవి ఏడాది పొడవునా దొరుకుతాయి. సుమారు ఐదువేల ఏళ్ల కిందటి నుంచి ఇరాన్, ఉత్తరభారత్ ప్రాంతాల్లో దానిమ్మను పండించేవారు.
తొలుత సిల్క్‌రోడ్డు మీదుగా చైనాకు, తర్వాతి కాలంలో పాశ్చాత్య నౌకా వర్తకుల ద్వారా ఇతర ప్రాంతాలకు దానిమ్మ విస్తరించింది.
ఎలాంటి వాతావరణంలోనైనా పెరగగలిగే దానిమ్మ ఖండాంతరాల్లోని ఇతర దేశాల్లో కూడా నిలదొక్కుకోగలిగింది. దళసరి తొక్కగల దానిమ్మపండ్లు మిగిలిన పండ్ల కంటే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
ఇదీ చదవండి: ఈ వారం కథ: 'పారిజాతం'


