నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మ‌హిళ దారుణ హ‌త్య‌..! | Hyderabad Meerpet Women Incident | Sakshi
Sakshi News home page

నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి.. మ‌హిళ దారుణ హ‌త్య‌..!

Nov 12 2026 12:29 PM | Updated on Nov 12 2026 12:29 PM

Hyderabad Meerpet Women Incident

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో మరో దారుణ హత్య కలకలం రేపింది. మీర్‌పేట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఓ మహిళను గుర్తుతెలియని దుండగులు అత్యంత దారుణంగా హతమార్చారు. నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి ప్రాణాలు తీశారు. ఇంట్లోనే రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉన్న తల్లిని చూసిన పిల్లలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. వెంటనే తండ్రికి సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

మీరపేట్‌ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఉన్న శ్రీలక్ష్మి రెసిడెన్సీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి అరుణ్‌కుమార్‌ తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆయన భార్య అనిత (35) ఇంట్లో ఉండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆమె నోట్లో గుడ్డలు కుక్కి, కాళ్లు కట్టేసి హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. అనితను ఎవరు హత్య చేశారు? ఎందుకు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు? ఇంట్లోకి ప్రవేశించి హత్య చేశారా? లేక ఆమెకు తెలిసినవారే ఈ దారుణానికి ఒడిగట్టారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement