వణుకు పుడుతోంది శివశివా..! | Cold Wave In AP And Telangana | Sakshi
Sakshi News home page

వణుకు పుడుతోంది శివశివా..!

Nov 12 2026 7:56 AM | Updated on Nov 12 2026 7:56 AM

Cold Wave In AP And Telangana

సాక్షి, హైదరాబాద్‌: మహా నగరాన్ని బుధవారం తెల్లవారుజామున చలిగాలులు చుట్టుముట్టాయి. పగలు ఆకాశం నిర్మలంగా ఉండి ఎండ కాస్తుండగా, రాత్రి, తెల్లవారుజామున శీతల గాలులు ప్రభావం చూపుతున్నాయి. శివారు ప్రాంతాల్లో చలి ఎక్కువగా కనిపిస్తోంది. రాజేంద్రనగర్‌లో అత్యల్పంగా 12.0 డిగ్రీలు..అంటే సాధారణం కంటే 4.8 డిగ్రీలు తక్కువగా రికార్డు అయింది. పటాన్‌ చెరులో 12.6, కుత్బుల్లాపూర్‌లో 14.1, శేరిలింగంపల్లిలో 14.2, కూకట్‌పల్లిలో 14.5 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఇదే తరహాలో అమీన్‌ పూర్‌లో 14.9, బీహెచ్‌ఈఎల్‌లో 15.1,దుండిగల్‌లో 15.9, హకీంపేటలో 17.0 డిగ్రీలు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. హైదరాబాద్‌ మొత్తం మీద సగటున 16.1 డిగ్రీల నమోదైంది.. అంటే శివార్లతో పోలిస్తే నగర కేంద్రంలో ఐదారు డిగ్రీల తేడా కనిపిస్తోంది. ఖైరతాబాద్, అబిడ్స్, కోఠి, అంబర్‌పేట, చార్మినార్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో పగటిపూట వేడి ఎక్కువగానే కనిపించింది. రానున్న రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదు కావచ్చని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement