వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విధానం: రేవంత్‌రెడ్డి ప్రకటన | 10 2 system to be implemented from the next academic year | Sakshi
Sakshi News home page

వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విధానం: రేవంత్‌రెడ్డి ప్రకటన

Nov 11 2026 9:53 PM | Updated on Nov 11 2026 9:53 PM

10 2 system to be implemented from the next academic year

హైదరాబాద్‌: విద్యాశాఖ సమీక్షలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. CBSE, ICSE తరహాలోనే.. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 10+2 విద్యా విధానాన్ని అమలు చేయనున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5వ తరగతి నుంచి 8వ తరగతి వరకు సెకండరీ విద్య, 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు సీనియర్‌ సెకండరీ విద్య ఉండనుంది. 12వ తరగతి నుంచి స్కిల్స్‌పై ప్రత్యేక దృష్టి పెడతామని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

ఇంటర్మీడియట్ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయనుండడంపై బుధవారం విద్యాశాఖ అధికారులతో రేవంత్‌ రెడ్డి సమావేశమై చర్చించారు. విద్యార్థుల‌ ప్ర‌యోజ‌నాలే ల‌క్ష్యంగా సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నామ‌ని చెప్పారు. న‌ర్స‌రీ నుంచి యూనివ‌ర్సిటీ వ‌ర‌కు నాణ్య‌మైన విద్యా బోధ‌న ద్వారా, ఆధునిక ప్ర‌పంచ అవ‌స‌రాల‌కు అనుగుణంగా విద్యార్థుల‌ను తీర్చిదిద్ద‌డ‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్నామ‌ని అన‍్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement