దర్శన్‌కు పవిత్ర పలకరింపు | Darshan and Pavithra Gowda Speak On Video Conference | Sakshi
Sakshi News home page

దర్శన్‌కు పవిత్ర పలకరింపు

Nov 13 2026 8:08 AM | Updated on Nov 13 2026 8:11 AM

Darshan and Pavithra Gowda Speak On Video Conference

బెంగళూరు: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు సెంట్రల్‌ జైల్లో ఉన్న నిందితులు ప్రముఖ నటుడు దర్శన్, నటి పవిత్రగౌడ గురువారం కోర్టు విచారణలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సమయంలో పవిత్ర.. దర్శన్‌ ఆరోగ్యం ఎలా ఉందని అడిగింది. బాగున్నానంటూ దర్శన్‌ ఆమెకు భరోసా ఇచ్చాడు. 

విచారణ వీడియో కట్‌ కాగానే పవిత్రగౌడ.. దర్శన్‌ను ఎలా ఉన్నావంటూ పలకరించింది. జైల్లో ఉండలేకపోతున్నట్లు పవిత్రగౌడ వాపోయింది. నరకం చూస్తున్నట్లు తెలిపింది. మరో 4 నెలల పాటు ఇలానే ఉండాలని దర్శన్‌ ఆమెకు ధైర్యం చెప్పినట్లు తెలిపింది. వీరిద్దరు మాట్లాడుకోవడాన్ని మిగతావారు ఆశ్చర్యంగా గమనించారు.   

ఇదీ చదవండి: గొడ్రాలు అన్నందుకు.. భర్తను నరికి చంపింది!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement