పెళ్లైన తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య.. | married woman ends life in karnataka | Sakshi
Sakshi News home page

పెళ్లైన తొమ్మిది నెలలకే వివాహిత ఆత్మహత్య..

Nov 10 2026 1:13 PM | Updated on Nov 10 2026 1:21 PM

married woman ends life in karnataka

కర్ణాటక : పెళ్లయిన 9 నెలలకే నవ వివాహిత వరకట్నం వేధింపులకు బలైన విషాద సంఘటన బెంగళూరు కోణనకుంటలో జరిగింది. శిరీషా (23) మృతురాలు. వివరాలు.. 

ఓ అపార్ట్‌మెంట్‌లో భర్త ప్రశాంత్, అత్త రుక్మిణితో కలిసి ఆమె నివసిస్తోంది. పుట్టింటి నుంచి మరింత వరకట్నం తేవాలని తమ కుమార్తెను వేధించేవారని శిరీషా తల్లిదండ్రులు ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో సోమవారం ఉదయం శిరీషా ఉరివేసుకున్న స్థితిలో ప్రాణాలు విడిచింది. పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి మృతదేహాన్ని కిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు.  

ఇదీ చదవండి: ముద్దు అంటే అక్కడ సిగ్గు కాదు.. స్వేచ్ఛకు చిహ్నం! ఆసక్తికర చరిత్ర!


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement