యశవంతపుర: కేంద్రమంత్రి హెచ్‌డీ హెచ్‌డి కుమారస్వామి, హాసన్ జిల్లా కలెక్టర్ కేఎస్ లతాకుమారి మధ్య సోషల్ మీడియా ద్వారా యుద్ధం నడుస్తోంది. సింహం కూర్చుని ఉంటే, కొన్ని కుక్కలు మొరుగుతున్న చిత్రాన్ని కలెక్టరు ఎక్స్‌లో పోస్టు చేశారు, ప్రతి విషయంపై స్పందించడం మంచిది కాదని ఆమె పేర్కొన్నారు. కలెక్టరు, జిల్లా మంత్రి శివలింగేగౌడ లంచాలు తీసుకుంటున్నారని కుమారస్వామి ఆదివారం ఆరోపణలు చేశారు.
అలాగే గతంలో కేపీఎస్‌సీ ఉద్యోగాల స్కాంలో లతాకుమారి పాత్ర ఉందని కుమారస్వామి ఆరోపణలు చేయడం తెలిసిందే. అప్పటి నుంచి కలెక్టర్ వాట్సాప్ స్టేటస్, సోషల్ మీడియాలో పరోక్షంగా పోస్టులు చేస్తున్నారు. కుమారస్వామి చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని అన్నారు. తనపై ఆరోపణలు చేసిన కొందరు నాయకులపై చర్యలు తీసుకోవడం గురించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించనున్నట్లు ఆమె తెలిపారు.
కలెక్టర్ పీఏ ఆడియో వైరల్
మరోవైపు ముడుపుల వ్యవహారం గురించి కలెక్టర్ పీఏ, ఎస్‌డీఏ అయిన శశికిరణ్ మాట్లాడిన ఫోన్ కాల్ ఆడియో జిల్లాలో వైరల్ అయ్యింది. దీనిపై శశికిరణ్ హాసన్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శశికిరణ్ మొబైల్‌ను పోలీసులు స్వా«దీనం చేసుకున్నారు.
ఇదీ చతదవండి: రంగారెడ్డి కలెక్టర్‌కు 6 నెలల జైలు


