కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ వ్యాఖ్య
న్యూఢిల్లీ/పట్నా: బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్ భారతీయ పౌరుడు కాడని, సర్‌కు వ్యతిరేకంగా జరిగే నిరసనల్లో ఆయన పాల్గొని ఉండాల్సింది కాదని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ చెప్పారు. అమెరికా పౌరసత్వ కలిగిన ఇమ్రాన్ దాదాపు పదేళ్లుగా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్నారని, అయినంత మాత్రాన ఆయన ఇక్కడి పౌరుడిగా మారిపోడని అన్నారు. సర్‌పై జరుగుతున్న ఆందోళనలను విదేశీ శక్తుల ప్రోద్బలంతో దేశంలో అరాచకం సృష్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలుగా మంత్రి అభివర్ణించారు.
ఈసీకి వ్యతిరేకంగా ముంబైలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న ఇమ్రాన్‌కు దేశం విడిచి వెళ్లాలంటూ కేంద్రం నోటీసు ఇవ్వడంపై మంత్రి స్పందించారు. మరోవైపు, ఫ్రాన్స్, బంగ్లాదేశ్‌లలో మాదిరిగానే భారత వ్యతిరేక గ్రూపులు, కొందరు రాజకీయ నేతలు యువతను రెచ్చగొడుతూ హింసాత్మక ఘటనలకు అండగా నిలుస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు పేర్కొన్నారు. ఇలా కుట్రలు పన్నేవారు ఒక విషయం తెలుసుకోవాలి. ఇది భారత్..ఫ్రాన్స్ కాదు..బంగ్లాదేశ్ అంతకన్నా కాదు..’అని రిజిజు వ్యాఖ్యానించారు. ప్రభుత్వం మారడం సాధ్యమేనన్న ఆయన..అది సొరోస్ ద్వారా మాత్రం కాదన్నారు.


