రీసెంట్ టైంలో తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో చాలా సినిమాలు వస్తున్నాయి. అలాంటి మరో మూవీ 'దండోరా'. శివాజీ, బిందుమాధవి, నవదీప్, రవికృష్ణ, నందు తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం.. డిసెంబరు 25న థియేటర్లలోకి రానుంది. ఇప్పటినుంచే ప్రమోషన్ మొదలుపెట్టేశారు. అడివి శేష్ చేతుల మీదుగా ఇప్పుడు టీజర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: రీతూ గుండె ముక్కలు చేసిన పవన్.. ఈవారం బిగ్ బాస్ నామినేషన్స్)
తెలంగాణలోని ఓ పల్లెలో ఒకరు చనిపోతారు. తర్వాత ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు ఏమైందనేదే స్టోరీలా అనిపిస్తుంది. గతంలో ఇలానే చావు చుట్టూ జరిగే కథతో 'బలగం' తీశారు. అది ఓవైపు కామెడీగా సాగుతూనే చివరలో ఎమోషనల్ చేసింది. 'దండోరా' మాత్రం సీరియస్ డ్రామాలా అనిపిస్తుంది. అలానే ఇందులో ప్రేమకథ, వేశ్య స్టోరీ, సర్పంచ్ స్టోరీ లాంటి ఉపకథలు కూడా కనిపించాయి.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)


