ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్ | Tollywood Hero Jr Ntr tweet On Tollywood latest movie | Sakshi
Sakshi News home page

Jr NTR: ఆ సినిమాపై ఎన్టీఆర్ ప్రశంసలు.. కథ అద్భుతమంటూ ట్వీట్

Jan 19 2026 8:40 PM | Updated on Jan 19 2026 8:40 PM

Tollywood Hero Jr Ntr tweet On Tollywood latest movie

దండోరా మూవీపై జూనియర్ ఎన్టీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారని అన్నారు. ఇప్పుడు దండోరా సినిమా చూశానని.. చాలా ఆలోచించేలా చేసిందని కొనియాడారు. శివాజీ, నవదీప్‌, నందు, రవికృష్ణ, బిందు మాధవి అద్భుతంగా నటించారని ఎన్టీఆర్‌ ప్రశంసించారు.

ఇంత బలమైన కథను ‍అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు మురళీ కాంత్‌కు నా ప్రత్యేక అభినందనలు అంటూ ట్వీట్‌లో రాసుకొచ్చారు. ఈ ప్రయత్నానికి మద్దతు ఇచ్చినందుకు రవీంద్ర బెనర్జీకి నా అభినందనలు అంటూ పోస్ట్ చేశారు. ఇంతటి అద్భుతమైన చిత్రానికి మద్దతు ఇచ్చి.. ఈ మూవీలో భాగమైనందుకు తారాగణం, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇది కాస్తా నెట్టింట వైరల్‌ కావడంతో.. హీరో నవదీప్ రిప్లై ఇచ్చాడు. థ్యాంక్ యూ అన్నయ్య అంటూ పోస్ట్ చేశాడు.

కాగా.. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సలార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబోలో వస్తున్న మూవీకి డ్రాగన్‌ అనే పేరు టైటిల్‌ పెట్టనున్నారని టాక్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ వచ్చింది. ఈ చిత్రంలో యానిమల్ నటుడు అనిల్ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నారని అఫీషియల్‌ ప్రకటన వచ్చేసింది.
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement