బాబీ, సంజీవ్ రెడ్డి, విక్రాంత్
‘‘సంతానప్రాప్తిరస్తు’లో ఇన్‌ఫెర్టిలిటీ లాంటి సెన్సిటివ్ సబ్జెక్ట్‌ను అందరికీ నచ్చేలా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ కథను స్క్రీన్ మీదకు తీసుకొచ్చేందుకు ఆరేళ్లు వెయిట్ చేశారు దర్శకుడు సంజీవ్‌గారు. ఓపికగా ఉండటం అనేది గొప్ప విషయం. శ్రీధర్, హరిప్రసాద్‌గార్లకు మంచి విజయం దక్కాలి’’ అని దర్శకుడు బాబీ చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా ‘సంతానప్రాప్తిరస్తు’.
సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 14న విడుదల కానుంది. హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు దర్శకులు బాబీ, సందీప్ రాజ్, శైలేష్ కొలను, బీవీఎస్ రవి, నిర్మాతలు లగడపాటి శ్రీధర్, శింగనమల కల్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరై, మాట్లాడారు. ‘‘సంతాన సమస్యలు ఉన్నవారు చికిత్స తీసుకోవచ్చు. కానీ అన్నీ బాగుండి లైఫ్ స్టైల్ వల్ల సంతాన లేమితో బాధపడేవారిని ఈ మూవీలో అడ్రస్ చేశాం’’ అని తెలిపారు సంజీవ్ రెడ్డి.


