విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు"(Santhana Prapthirasthu). ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఈ నెల 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఈ రోజు ఈ సినిమా నుంచి 'మరి మరి..' లిరికల్ సాంగ్ రిలీజ్ చేశారు. ఉమా వంగూరి లిరిక్స్ అందించిన ఈ పాటను సునీల్ కశ్యప్ కంపోజ్ చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ పాడారు.
ఈ పాట ఎలా ఉందో చూస్తే -' మరి మరి నిన్ను వెతికేలా, మరవదు ఓ క్షణమైనా, మనసంతా నీ తలపులే, ప్రతి చోటా నీ గురుతులే, వేచా గడిచిన నిన్నల్లో, వెతికా నడిచిన దారుల్లో, వెలుగే విడిచిన నీడల్లో, వదిలి వెళ్లిన జాడల్లో...'అంటూ ఎమోషనల్ గా సాగుతుందీ పాట. ప్రాణంగా ప్రేమించిన భార్యతో వచ్చిన ఎడబాటు ఎలాంటి బాధను మిగిల్చిందో హీరో వ్యక్తం చేస్తున్న సందర్భంలో ఈ పాటను పిక్చరైజ్ చేశారు.


