టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదన్నారు. మనం తీసిన సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడమే అసలైన సవాల్ అని తెలిపారు. ప్రెస్‌మీట్స్ పెట్టి ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మీరిచ్చే కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో కూర్చోబెట్టాలని సూచించారు. మార్నింగ్ షోకు ఆడియన్స్ తీసుకురావడమే గొప్పదనమన్నారు. మీడియా వాళ్లు కూడా పాజిటివ్‌గా రివ్యూలు ఇస్తే సినిమా ఇండస్ట్రీకి ఎంతో మేలని దిల్ రాజు అన్నారు. మీరు అలా రాసినప్పుడే మార్నింగ్ ఫస్ట్ షోలకు కలెక్షన్స్ పెరుగుతున్నాయని తెలిపారు. సంతాన ప్రాప్తిరస్తు మూవీ ట్రైలర్ లాంఛ్‌కు హాజరైన దిల్ రాజు మాట్లాడారు.
కాగా.. విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం సంతాన ప్రాప్తిరస్తు(Santhana Prapthirasthu). ఈ మూవీకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుత రోజుల్లో సంతానం కోసం యువత పడే పాట్లను ఇందులో చూపించనున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ మూవీ నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది.
సినిమాలు తీయడాలు, ప్రెస్ మెట్లు పెట్టి ట్రైలర్లు లాంచ్ చేయడం గొప్ప కాదు..
మార్నింగ్ షోకు జనాలను తీసుకొచ్చి, సినిమా సక్సెస్ అనిపించుకోవడమే గొప్ప!
- #DilRaju#SanthanaPrapthirasthu pic.twitter.com/MxmRCTmP9s— Suresh PRO (@SureshPRO_) November 6, 2025


