విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటించిన సినిమా 'సంతాన ప్రాప్తిరస్తు'. మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. సంజీవ్ రెడ్డి దర్శకుడు. నవంబర్ 14న ఈ మూవీ థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో సోమవారం సినిమాలోని ఓ పాట లాంచ్ చేశారు.
తెలుసా నీ కోసమే అంటూ సాగే లిరికల్ గీతాన్ని అతిథిగా హాజరైన ప్రొడ్యూసర్ సురేష్ బాబు రిలీజ్ చేశారు. 'ఆయ్', 'సేవ్ ది టైగర్స్' లాంటి సక్సెస్ ఫుల్ ప్రాజెక్టులకు పనిచేసిన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ.. ఈ గీతాన్ని కంపోజ్ చేశారు. శ్రీమణి ఆకట్టుకునే లిరిక్స్ అందించగా.. అర్మాన్ మాలిక్ మనసుకు హత్తుకునే పాడారు.


