‘‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమాలో ప్రేమకథ ఉంటుంది. కుటుంబ భావోద్వేగాలతో పాటు వినోదం ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం సమాజంలో చాలామంది ఎదుర్కొంటున్న ఓ చిన్న సమస్యను కూడా చూపించాం’’ అని డైరెక్టర్ సంజీవ్ రెడ్డి(Sanjeev Reddy ) చెప్పారు. విక్రాంత్, చాందినీ చౌదరి జోడీగా నటించిన చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’(Santhana Prapthirasthu Movie). మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు సంజీవ్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం సమాజంలో ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉన్నాయి.
మేల్ ఫెర్టిలిటీ అనే సమస్య నేపథ్యంగా ఇప్పటిదాకా తెలుగులో ఏ మూవీ రాలేదు. నాకు తెలిసిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కొందరు ఇలాంటి ఇష్యూస్‌తో బాధపడ్డారు. వారికి ఆధునిక వైద్యంతో పిల్లలు పుట్టినప్పటికీ వారు సొసైటీ నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. ఈ కాన్సెప్ట్‌తో సినిమా చేస్తే బాగుంటుందని ‘సంతాన ప్రాప్తిరస్తు’ స్క్రిప్ట్ రెడీ చేశాను.
ఇలా నేను చూసిన సమస్యతోనే ఈ సినిమా చేశాను. విక్రాంత్‌కి ఈ కథ బాగా నచ్చింది. ఫెర్టి లిటీ ఇష్యూ అనేది మాట్లాడకూడని అంశం కాదు... సమాజం ఎదుర్కొంటున్న ఒక సమస్య. మా సినిమాని చూసేందుకు పిల్లలు లేని కపుల్స్‌గానీ ఫ్యామిలీ ఆడియన్స్ గానీ ఇబ్బంది పడరు. ఇప్పటిదాకా నాలుగు గోడల మధ్యనే మాట్లాడుకునే ఫెర్టిలిటీ అంశాన్ని మా సినిమా చూశాక బహిరంగంగా మాట్లా డతారని అనుకుంటున్నాం’’ అని చెప్పారు.


