
యూపీలో ప్రస్తుతం జరుగుతున్న కుంభమేళా పలువురి తలరాతలను మార్చేసింది. అటువంటి వారిలో మోనాలిసా ఒకరు. కుంభమేళాకు పూసల దండలు విక్రయించేందుకు వచ్చిన ఆమె రాత్రికిరాత్రే ఎంతో ఫేమస్ అయిపోయింది. జనం ఆమెను చూసేందుకు గుమిగూడుతుండటంతో ఆమె తండ్రి మోనాలిసాను మధ్యప్రదేశ్‌లోని తమ ఇంటికి తిరిగి పంపించేశాడు. అయితే అక్కడకు కూడా ఆమె అభిమానులు తరలివస్తున్నారు.
కుంభమేళాలో ఫేమస్ అయిన మోనాలిసా నటిస్తున్న తొలిచిత్రం షూటింగ్ ఫిబ్రవరి 12న ఢిల్లీలోని ఇండియాగేట్ దగ్గర ప్రారంభం కానున్నదని తెలుస్తోంది. అయితే షూటింగ్ తేదీ విషయమై ఇంకా నిర్థారణ కాలేదని సమాచారం. ఇదిలావుండగా ఇంతలో ఆమెను ఒక ప్రముఖ జ్యూలయరీ కంపెనీ కలుసుకున్నదని, ఆమెను ఆ కంపెనీ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిచేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
మోనాలిసా నటిస్తున్న సినిమాకు చెందిన చిత్రబృందం మీడియాతో మాట్లాడుతూ ప్రముఖ జ్యూయలరీ కంపెనీ మోనాలిసాను సంప్రదించిందని, ఆమెతో వారు ఒక ఒప్పందం కుదుర్చుకున్నారని తెలిపింది. ఇందుకోసం వారు రూ.15 లక్షలకు కూడా ఇచ్చారని చిత్రబృందం పేర్కొంది. ఈ కంపెనీకి సంబంధించిన ప్రకటన షూటింగ్ ఫిబ్రవరి 14న మొదలుకానున్నదని, ఇందుకోసం మోనాలిసా కేరళ వెళ్లనున్నారని వివరించింది.
ఇది కూడా చదవండి: Mahakumbh: మాఘ పూర్ణిమకు సన్నాహాలు.. క్రౌడ్ మేనేజ్‌మెంట్‌పై ప్రత్యేక దృష్టి