కెనడాలో 28 ఏళ్ల భారత మూలాలకు చెందిన వ్యక్తిని కొంతమంది కాల్చి హత్య చేయడంపై గ్యాంగ్ వార్‌గా అనుమానిస్తున్నారు. దిల్‌రాజ్ సింగ్ గిల్ అనే వ్యక్తిని కొంతమంది దాడి చేశారు. గత గురువారం సాయంత్రం గం. 5.30 ని.లకు బర్నబీ నగరంలో గిల్‌ను పలువురు కాల్చి చంపారు.
బర్నబీ ఆర్సీఎంపీ ఫ్రంట్‌లైన్ అధికారులు కెనడా వే 3700 బ్లాక్ వద్ద కాల్పులు జరిగాయని వచ్చిన సమాచారం మేరకు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సరికి అక్కడ ఓ వ్యక్తి రోడ్డపై పడి ఉన్నాడు. అయితే అతని ప్రాణాలను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
ఆ వ్యక్తి తుదిశ్వాస విడిచాడని పోలీసులు తెలిపారు. తమక గిల్ బాగా తెలిసిన వ్యక్తిగా పోలీసులు చెబుతున్నారు. రెండు వర్గాల మధ్య చోటు చేసుకున్న గ్యాంగ్ వార్ కారణంగానే గిల్‌ను కాల్చి హత్య చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఇలా పబ్లిక్ ప్లేస్‌లో కాల్పులు జరగగంపై పోలీసుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఇది పోలీసులకు మాత్రమే కాకుండా మొత్తం సమాజాన్ని కూడా కలవరపెట్టే అంశం. సంఘటనా స్థలంలో ఉన్న సాక్షులు, అక్కడి ప్రజల నుండి లభించే సమాచారం ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


