ప్రభాస్(Prabhas)- సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) క్రేజీ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవేటేడ్ మూవీ స్పిరిట్(Spirit Movie). ఈ ప్రాజెక్ట్ అప్‌డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 23న రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఆడియో గ్లింప్స్ రిలీజ్ చేశారు. 'సౌండ్ స్టోరీ ఆఫ్ ది ఫిలిం స్పిరిట్' ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చారు. ఈ చిత్రంలో యానిమల్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ మూవీతో బాలీవుడ్ భామ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.
తాజాగా ఈ మూవీకి సంబంధించిన మరో అప్‌డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. జిగ్రీస్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సందీప్ ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. స్పిరిట్ చిత్ర షూటింగ్ ఈ నెలఖరులో ప్రారంభించినున్నట్లు తెలిపారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
స్పిరిట్‌పై రూమర్స్..
అయితే బిగ్ ప్రాజెక్ట్‌పై రూమర్స్ కూడా అదే స్థాయిలో వైరలవుతున్నాయి. ఈ మూవీలో మెగాస్టార్‌తో పాటు కొరియన్ స్టార్ డాన్‌లీ కూడా నటించనున్నారని వార్తలొచ్చాయి. అయితే అలాంటిదేం లేదని సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాజాగా స్పిరిట్‌కు సంబంధించిన మరో వార్త నెట్టింట వైరల్‌గా మారింది.
ఈ మూవీతో టాలీవుడ్ స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కుమారులు ఎంట్రీ ఇవ్వనున్నారని లేటేస్ట్ టాక్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తనయుడు రిషి మనోజ్, అలాగే హీరో రవితేజ కుమారుడు మహదాన్ భూపతిరాజు స్పిరిట్‌కు పని చేయనున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది. వీరిద్దరు సందీప్ రెడ్డికి అసిస్టెంట్స్ డైరెక్టర్స్‌గా పని చేస్తారని టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు. ఈ విషయంపై మేకర్స్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.
#SandeepReddyVanga ropes in two star kids as assistant directors for #Spirit 🔥
Rishie Manoj (#Trivikram’s son) & Mahadhan (#RaviTeja’s son) join the team! 🎬#Prabhas pic.twitter.com/vHb7KbucL8— CHITRAMBHALARE (@chitrambhalareI) November 13, 2025


