
తనదైన అందాలతో యువతను ఆకట్టుకునే బ్యూటీ యషిక ఆనంద్. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న తాజా చిత్రం టాస్. ఈ మూవీలో తేజస్విని మరో హీరోయిన్గా నటిస్తోది. ఈ చిత్రంలో రత్నం మౌళి కథానాయకుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు సగు పాండియన్ దర్శకత్వం వహిస్తున్నారు.ఈ చిత్రం షూటింగ్ ఇటీవల తమిళనాడులోని కోవెల్ పట్టిలో పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా టాస్ దర్శకుడు మాట్లాడుతూ.. 'ఇది ఒక ప్రాంతంలో జరిగే 3 హత్యల నేపథ్యంలో సాగే మర్డర్ మిస్టరీ కథా చిత్రంగా ఉంటుందని చెప్పారు. ఆ హత్యల నేపథ్యం ఏమిటి? వాటికి నటి యషిక ఆనంద్కు ఉన్న సంబంధం ఏంటి అన్న అంశాలతో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథగా తెరకెక్కిస్తున్నాం. ఈ మూవీ షూటింగ్‌ను కోవెల్ పట్టి, బిరుదు నగర్, సాత్తూర్ ప్రాంతాల్లో నిర్వహించి 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో గాని 2026 ప్రథమార్ధంలో గాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు' చెప్పారు.

ఈ చిత్రం కచ్చితంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నమ్మముందని దర్శకుడు ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ఈ చిత్రానికి శాంతన్ అనిభజనే సంగీతం అందిస్తుండగా.. ధర్మ దురై సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ మూవీలో విజయ్ టీవీ ఫేమ్ యోగి ,షన్న, సంజయ్ శంకర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లాక్ డైమండ్ స్టూడియో పతాకంపై సయ్యద్ జాఫర్ నిర్మిస్తున్నారు.