
ధనుష్ హీరోగా వెట్రిమారన్ దర్శకత్వంలో రూ పొందిన క్రైమ్ డ్రామా మూవీ ‘వడ చెన్నై’ (2018) ఘనవిజయం సాధించింది. ఈ చిత్రకథలో రెండో భాగానికి అవకాశం ఉందని వెట్రిమారన్ పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అప్పట్నుంచి ‘వడ చెన్నై 2’ అప్‌డేట్ కోసం ధనుష్ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
ఇటీవల ఓ సందర్భంలో వెట్రిమారన్ సీక్వెల్ ఉంటుందని స్పష్టం చేశారు. తాజాగా తన ‘ఇడ్లీ కడై’ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్న ధనుష్ కూడా ఈ సీక్వెల్ గురించి మాట్లాడారు. ‘‘వడ చెన్నై 2’ షూటింగ్‌ని 2026లో ఆరంభిస్తాం. 2027లో గ్రాండ్‌గా విడుదల చేస్తాం’’ అని ధనుష్ పేర్కొన్నారు. మరి... తొలి భాగంలో నటించిన ఆండ్రియా. సముద్ర ఖని, ఐశ్వర్యా రాజేశ్ సీక్వెల్‌లోనూ నటిస్తారా? అనేది తెలియాల్సి ఉంది.