‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు తమిళ హీరో అజిత్. అయితే అజిత్ నెక్ట్స్ చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తీసిన అధిక్ రవిచంద్రన్‌తోనే అజిత్ మళ్లీ ఓ సినిమా చేయనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపించింది. అయితే మలయాళ యాక్షన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మార్కో’ ఫేమ్ హనీష్ అధేని డైరెక్షన్‌లోఅజిత్ హీరోగా ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం రూ పొందనుందనే టాక్ తెరపైకి వచ్చింది.
ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, అజిత్‌తో ఆల్రెడీ ‘దిల్’ రాజు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇక హనీష్‌తో నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్, సునీత తాటి ఓ హై బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాను నిర్మించనున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో ఓ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి... ఈ మల్టీస్టారర్ సినిమాలో అజిత్ హీరోగా చేస్తారా? లేక అజిత్‌తో సోలో సినిమాను నిర్మించేందుకు ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారా? అనే అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది.