breaking news
haneesh
-
మార్కో దర్శకుడితో..?
‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్నారు తమిళ హీరో అజిత్. అయితే అజిత్ నెక్ట్స్ చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాగా, ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమా తీసిన అధిక్ రవిచంద్రన్‌తోనే అజిత్ మళ్లీ ఓ సినిమా చేయనున్నారనే టాక్ కోలీవుడ్‌లో వినిపించింది. అయితే మలయాళ యాక్షన్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘మార్కో’ ఫేమ్ హనీష్ అధేని డైరెక్షన్లోఅజిత్ హీరోగా ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం రూ పొందనుందనే టాక్ తెరపైకి వచ్చింది.ఈ సినిమాను ‘దిల్’ రాజు నిర్మించనున్నారని, అజిత్‌తో ఆల్రెడీ ‘దిల్’ రాజు సంప్రదింపులు జరుపుతున్నారని తెలిసింది. ఇక హనీష్‌తో నిర్మాతలు ‘దిల్’ రాజు, శిరీష్, సునీత తాటి ఓ హై బడ్జెట్ మల్టీస్టారర్ సినిమాను నిర్మించనున్నట్లుగా ఈ ఏడాది మార్చిలో ఓ అధికారిక ప్రకటన వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. మరి... ఈ మల్టీస్టారర్ సినిమాలో అజిత్ హీరోగా చేస్తారా? లేక అజిత్‌తో సోలో సినిమాను నిర్మించేందుకు ‘దిల్’ రాజు సన్నాహాలు చేస్తున్నారా? అనే అంశాలపై త్వరలోనే స్పష్టత రానుంది. -
ఆమె అతడుగా మారితే..
షార్ట్ ఫిలిమ్స్‌ను ఎంజాయ్ చేసే వాళ్లకు, కూచిపూడి నాట్యప్రియులకు అతడు చిరపరిచితుడు. యువకుడు... కూచిపూడి నృత్యాన్ని ప్రొఫెషన్ గా స్వీకరించడం మాత్రమే కాదు... అచ్చం స్త్రీ రూపంలోకి ఆవాహనం చెందడం ద్వారా సిటీలోని కల్చరల్ సర్కిల్లో తరచూ వినపడే, కనపడే హలీమ్‌ఖాన్ ... ఇప్పుడు ఏకంగా ఆన్ స్క్రీన్ లో దర్శనమిచ్చాడు. ‘ఆమె అతడైతే’ సినిమా ద్వారా ‘హనీశ్’ పేరుతో వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో హలీమ్ ఖాన్ ‘సాక్షి’తో పంచుకున్నవిశేషాలు.. – శిరీష చల్లపల్లి ఒంగోలులో జిల్లా మారుమూల గ్రామంలోని ముస్లిం కుటుంబంలో జన్మించాను. కూచిపూడి నేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాను. ఆ అంకితభావమే నన్ను దేశ విదేశాల్లో డ్యాన్స్ షోలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేసింది. కూచిపూడి నృత్యంలో భాగమైన ‘రూపానురూపం’ అనే ప్రక్రియకు పేరొందాను. ఒక మహిళగా అభినయంలో సంపూర్ణంగా ఒదిగిపోగలగడమే నాకు పేరు తెచ్చిపెట్టింది. అమ్మాయిల అభినయించడాన్ని కామెంట్ చేసినా పట్టించుకోకుండా ఉండడం అలవాటైంది. సినిమాల్లోనూ కొన్ని చిత్రమైన పాత్రలు రావడానికి నా నృత్యశైలి ఒక కారణమైంది. ఈ సినిమా... ఓ లక్ డ్యాన్సర్‌గా సత్యభామ, పార్వతి, పద్మావతి... ఇలా ఎన్నో పాత్రలు చేసిన అనుభవం ఉంది. అయితే ఇప్పుడు ‘ఆమె అతడైతే’ సినిమాలో ఒకేసారి విభిన్న రకాల పాత్రలు పోషిస్తున్నాను. సాధారణంగా ఒక డ్యాన్సర్ హీరోగా సినిమాలో కనిపించడమనేది అరుదు. అలాంటి అరుదైన లక్ నాకు దక్కింది. ఈ సినిమాలో లవర్ బాయ్‌గా, అందమైన అమ్మాయిగా కనిపించాను. ఒక పూర్తిస్థాయి డీసెంట్ కామెడీ ఫిల్మ్ ఇది. ఒక రకంగా ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా తరహాలో సాగుతుందని చెప్పొచ్చు. అంతేకాదు త్వరలోనే ప్రారంభం కానున్న ఒక సినిమాలో పూర్తి స్థాయి విలన్ పాత్ర సైతం పోషించనున్నాను.