ఆమె అతడుగా మారితే.. | hyderabad actor haleem khan acted in ame athadu ithe short film | Sakshi
Sakshi News home page

ఆమె అతడుగా మారితే..

Nov 19 2016 11:40 PM | Updated on Sep 4 2017 8:33 PM

ఆమె అతడుగా మారితే..

ఆమె అతడుగా మారితే..

‘ఆమె అతడైతే’ సినిమా ద్వారా ‘హనీశ్‌’ పేరుతో వెండితెరకు పరిచయమయ్యాడు.

షార్ట్‌ ఫిలిమ్స్‌ను ఎంజాయ్‌ చేసే వాళ్లకు, కూచిపూడి నాట్యప్రియులకు అతడు చిరపరిచితుడు. యువకుడు... కూచిపూడి నృత్యాన్ని ప్రొఫెషన్ గా స్వీకరించడం మాత్రమే కాదు... అచ్చం స్త్రీ రూపంలోకి ఆవాహనం చెందడం ద్వారా సిటీలోని  కల్చరల్‌ సర్కిల్‌లో తరచూ వినపడే, కనపడే హలీమ్‌ఖాన్ ...  ఇప్పుడు ఏకంగా ఆన్ స్క్రీన్ లో దర్శనమిచ్చాడు.  ‘ఆమె అతడైతే’ సినిమా ద్వారా   ‘హనీశ్‌’ పేరుతో  వెండితెరకు పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో హలీమ్‌ ఖాన్‌ ‘సాక్షి’తో  పంచుకున్నవిశేషాలు..  – శిరీష చల్లపల్లి

ఒంగోలులో జిల్లా మారుమూల గ్రామంలోని ముస్లిం కుటుంబంలో జన్మించాను. కూచిపూడి నేర్చుకునే క్రమంలో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చుకున్నాను. ఆ అంకితభావమే నన్ను దేశ విదేశాల్లో డ్యాన్స్ షోలు ఇచ్చే స్థాయికి ఎదిగేలా చేసింది. కూచిపూడి నృత్యంలో భాగమైన  ‘రూపానురూపం’ అనే ప్రక్రియకు పేరొందాను. ఒక మహిళగా అభినయంలో సంపూర్ణంగా ఒదిగిపోగలగడమే నాకు పేరు తెచ్చిపెట్టింది. అమ్మాయిల అభినయించడాన్ని కామెంట్‌ చేసినా పట్టించుకోకుండా ఉండడం అలవాటైంది. సినిమాల్లోనూ కొన్ని చిత్రమైన పాత్రలు రావడానికి నా నృత్యశైలి ఒక కారణమైంది.

ఈ సినిమా... ఓ లక్‌
డ్యాన్సర్‌గా సత్యభామ, పార్వతి, పద్మావతి... ఇలా ఎన్నో పాత్రలు చేసిన అనుభవం ఉంది. అయితే ఇప్పుడు ‘ఆమె అతడైతే’ సినిమాలో ఒకేసారి విభిన్న రకాల పాత్రలు  పోషిస్తున్నాను. సాధారణంగా ఒక డ్యాన్సర్‌ హీరోగా సినిమాలో కనిపించడమనేది అరుదు. అలాంటి అరుదైన లక్‌ నాకు దక్కింది. ఈ సినిమాలో లవర్‌ బాయ్‌గా, అందమైన అమ్మాయిగా కనిపించాను. ఒక పూర్తిస్థాయి డీసెంట్‌ కామెడీ ఫిల్మ్‌ ఇది. ఒక రకంగా ‘చిత్రం భళారే విచిత్రం’ సినిమా తరహాలో సాగుతుందని చెప్పొచ్చు. అంతేకాదు త్వరలోనే ప్రారంభం కానున్న ఒక సినిమాలో  పూర్తి స్థాయి విలన్ పాత్ర సైతం పోషించనున్నాను.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement