షార్ట్ ఫిల్మ్‌లో మహేశ్ కొడుకు గౌతమ్.. ఎలా నటించాడంటే? | Mahesh Babu Son Gautam Short Film And Details | Sakshi
Sakshi News home page

Gautam Ghattamaneni: యాక్టర్ అయిపోయిన గౌతమ్.. షార్ట్ ఫిల్మ్ రిలీజ్

Mar 8 2026 8:30 PM | Updated on Mar 9 2026 9:33 AM

Mahesh Babu Son Gautam Short Film And Details

మహేశ్ బాబు ప్రస్తుతం 'వారణాసి' సినిమాతో బిజీగా ఉన్నాడు. మరోవైపు ఈ హీరో కొడుకు కూడా యాక్టర్ అయిపోయాడు. షార్ట్ ఫిల్మ్‌లో నటించేశాడు. పెద్దగా హడావుడి లేకుండానే దీన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసేశారు. సోషల్ మీడియాలో దీని గురించి ఇంకా ఎవరికీ తెలియకపోవడంతో వైరల్ కాలేదు. ఇంతకీ గౌతమ్ ఎలా నటించాడు? షార్ట్ ఫిల్మ్ కాన్సెప్ట్ ఏంటంటే?

(ఇదీ చదవండి: పెళ్లి వద్దన్నాడు, ఆరోజు బోరున ఏడ్చాడు: విజయ్‌ మేనమామ)

ఇక్కడ చదువు పూర్తి చేసిన గౌతమ్.. ప్రస్తుతం అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో యాక్టింగ్ కోర్స్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు తన స్నేహితులతో కలిసి సోషల్ మీడియాలో కనిపిస్తుంటాడు. ఇప్పుడు తన ఫ్రెండ్ అలెక్స్ లక్ష‍్మి తీసిన '14 డేస్' షార్ట్ ఫిల్మ్‌లో లీడ్ రోల్ చేశాడు. అనూశే ధనేని హీరోయిన్‌గా చేసింది. ఇందులో గౌతమ్‌తో పాటు మరో నాలుగు పాత్రలే కనిపించాయి.

కాన్సెప్ట్ విషయానికొస్తే.. కిడ్నాప్ అయిన తన ప్రియురాలి కోసం ఆలోచిస్తూ గౌతమ్ ఎలా బాధపడ్డాడు? కిడ్నాపర్‌ని ఎలా పట్టుకున్నాడనేది మూడు నిమిషాల 20 సెకన్ల షార్ట్ ఫిల్మ్‌లో చూపించారు. గౌతమ్ వరకు యాక్టింగ్ పర్లేదు. టెన్షన్ లాంటివి బాగానే చూపించాడు. అయితే ఈ షార్ట్ ఫిల్మ్‌లో స్టోరీని పూర్తి చేయలేదు. మధ్యలోనే వదిలేసినట్లు అనిపించింది. దీనికి కొనసాగింపుగా ఉందా? లేదా ఇంతేనా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!)

Advertisement
 
Advertisement
Advertisement