విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నేడు (అక్టోబర్ 16, 2026) సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం, శుక్రవారం ఒకే రోజు రావడంతో భక్తులు భారీగా పోటెత్తారు.
రద్దీ ఎక్కువగా ఉండటంతో అన్ని రకాల వీఐపీ, సిఫార్సు, ప్రోటోకాల్ దర్శనాలను అధికారులు పూర్తిగా రద్దు చేశారు.
సాధారణ భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత దర్శనానికి ఏర్పాట్లు చేశారు. కార్పొరేషన్ కార్యాలయం, పూల మార్కెట్ వద్ద ప్రత్యేక కంపార్టుమెంట్లు ఏర్పాటు చేశారు.


