షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌కు హాలీవుడ్‌ ఆఫర్‌! | Hollywood Offer For Train Driver Short Film Director Liu Ziyu | Sakshi
Sakshi News home page

షార్ట్‌ ఫిల్మ్‌ డైరెక్టర్‌కు హాలీవుడ్‌ ఆఫర్‌!

Jul 4 2026 8:26 AM | Updated on Jul 4 2026 9:15 AM

Hollywood Offer For Train Driver Short Film Director Liu Ziyu

సమ్‌థింగ్‌ స్పెషల్‌

చైనాలోని యునాన్‌ ప్రావిన్స్‌కు చెందిన లియు జియు కొంత కాలం ట్రైన్‌ డ్రైవర్‌గా పనిచేశాడు. అతడికి ఒకరోజు షార్ట్‌ ఫిల్మ్‌ తీయాలనిపించింది. యాభై వేల (మన కరెన్సీలో) కంటే తక్కువ ఖర్చుతో 3.5 నిమిషాల ఏఐ షార్ట్‌ఫిల్మ్‌ను రూపొందించాడు. సదరు ఈ షార్ట్‌ఫిల్మ్‌ సూపర్‌ హిట్‌ కావడమే కాదు ఏకంగా హాలివుడ్‌ దృష్టిని ఆకర్షించింది.

‘జాంబీ స్కావెంజర్‌’ అనే ఈ ఏఐ ఫిల్మ్‌ను పది రోజుల్లో రూపొందించాడు లియు జియు. ఒక రోబో, మనిషి బొమ్మ చుట్టూ అల్లుకున్న కథ తో రూపొందించిన ఈ షార్ట్‌ఫిల్మ్‌  చైనీస్‌ సోషల్‌ మీడియా ΄్లాట్‌ఫామ్‌ ‘డౌయిన్‌’లో విడుదలైంది. హాలీవుడ్‌కు చెందిన ఏఐ చిత్ర నిర్మాత పీజే అక్సెటురో ఆన్‌లైన్‌లో ‘జోంబీ స్కావేంజర్‌’ను ప్రశంసించిన తరువాత ఈ షార్ట్‌ఫిల్మ్‌ అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.

‘నేను చూసిన అత్యుత్తమ షార్ట్‌ ఫిల్మ్స్‌లో జాంబీ స్కావెంజర్‌ ఒకటి. దర్శకుడిని ఎవరైనా కనుగొనగలిగితే, దయచేసి అతని సోషల్‌ మీడియా లింక్‌ను పంపండి. నేను అతడితో పని చేయాలనుకుంటున్నాను’ అని రాశాడు ఆక్సెటురో. ‘జాంబీ స్కావెంజర్‌’ ప్రపంచ వ్యాప్తం గా 60 మిలియన్‌ వ్యూస్‌ను దాటింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement