ఈమెని గుర్తుపట్టారా? సిద్దార్థ్‌తో హిట్ సినిమా.. ఇప్పుడేమో ఇలా | Nuvvostanante Nenoddantana Actress Jennifer Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ నటి

Jul 19 2025 9:19 PM | Updated on Jul 19 2025 9:19 PM

Nuvvostanante Nenoddantana Actress Jennifer Details

కొందరు బ్యూటీస్ ఒకటి రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. తమిళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయింది. అందులో హీరో సిద్దార్థ్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నందిత జెన్నీఫర్. తం‍డ్రి చిన్నా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకుంది. 2000కి ముందు ఓ పక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ అడపాదడపా మెరిసేది. అలా దర్శకుల దృష్టిలో పడి 'రిథమ్' అనే సినిమాతో నటిగా మారింది. అలా 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.

(ఇదీ చదవండి: హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!)

దాదాపు తమిళ సినిమాలే చేసినా ఈమె.. సిద్దార్థ్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో తెలుగులోకి పరిచయమైంది. డాలీ పాత్రలో తనదైన యాక్టింగ్ చేసి ఆకట్టుకుంది. మూవీ చూసినా ప్రతిసారి ఈమె పాత్ర కూడా నచ్చేస్తుంది. దీని తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది.

జెన్నీఫర్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2007లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలోనూ యాక్టివ్‌గానే ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. అయితే అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చేసింది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!

(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ లేకుండానే 'హరిహర వీరమల్లు' మేకింగ్ వీడియో)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement