
పవన్ కల్యాణ్ 'హరిహర వీరమల్లు' మరో వారంలో రిలీజ్ కానుంది. అయినాసరే అనుకున్నంతగా హైప్ రావట్లేదు. దీంతో పెట్టిన బడ్జెట్ రికవరీ కోసమో ఏమో గానీ ఏపీ ప్రభుత్వం నుంచి భారీగా టికెట్ రేట్ల పెంపు తెచ్చుకున్నారు. ఈ మేరకు జీవో కూడా వచ్చింది. తాజాగా మేకింగ్ వీడియో రిలీజ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ ఇక్కడే ఓ సందేహం కలుగుతోంది. అటు ప్రమోషన్లలో గానీ ఇటు మేకింగ్ వీడియోలోని గానీ ఒకటి మిస్ అవుతోంది. అదే క్రిష్.
(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి తెలుగు సినిమా)
'హరిహర వీరమల్లు' నిర్మించింది ఏఎం రత్నం కావొచ్చు, హీరోగా చేసింది పవన్ కల్యాణ్ కావొచ్చు. కానీ ఈ సినిమా తీయడానినికి మూలకారణం క్రిష్. కొన్నాళ్ల పాటు మూవీ టీమ్‌తో పాటు ట్రావెల్ చేసిన ఈయన.. ప్రాజెక్ట్ మరీ ఆలస్యం అవుతుండేసరికి అనివార్య కారణాలతో తప్పుకొన్నారు. అనంతరం నిర్మాత కొడుకైన జ్యోతికృష్ణ.. మిగిలిన పార్ట్ అంతా దర్శకత్వం వహించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్లలో క్రిష్ ఏ మాత్రం కనిపించట్లేదు. సరే ఇది పక్కనబెడితే.. తాజాగా మేకింగ్ వీడియోలోనూ క్రిష్ ఒక్కటంటే ఒక్క షాట్‌లోనూ లేరు.
మేకింగ్ వీడియోలో క్రిష్ లేకపోవడానికి కారణమేంటి అనేది మూవీ టీమ్‌కే తెలియాలి. పవన్‌తో పాటు ప్రధాన తారాగణం అంతా కనిపించాడు. చెప్పాలంటే పవన్‌తో పాటు జ్యోతికృష్ణ ఎక్కువగా కనిపించారు. త్రివిక్రమ్ కూడా కనిపించారు గానీ క్రిష్‍కి ఇందులో చోటు ఇవ్వకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. డైరెక్షన్ క్రెడిట్ మాత్రం క్రిష్‌తో పాటు జ్యోతికృష్ణ పంచుకున్నారు. మూవీ రిలీజ్ తర్వాత అయినా సరే క్రిష్ మీడియా ముందుకొస్తారా లేదా అనేది చూడాలి?
(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)