
మరో క్రేజీ తెలుగు థ్రిల్లర్ సినిమా ఓటీటీలో డేట్ ఫిక్స్ చేసుకుంది. థియేటర్లలో రిలీజైన మూడు వారాలకే డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. నవీన్ చంద్ర, కామాక్షిభాస్కర్ల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం కాన్సెప్ట్ పరంగా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. స్టార్ కాస్టింగ్ లేకపోవడంతో ఎప్పుడు వచ్చివెళ్లిందో అని తెలియనంత వేగంగా థియేటర్ల నుంచి మాయమైంది. ఇప్పుడు సడన్ సర్‌ప్రైజ్ అన్నట్లు ఓటీటీ రిలీజ్ తేదీని ప్రకటించారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి? ఎప్పుడు స్ట్రీమింగ్ కానుంది?
నవీన్ చంద్ర రీసెంట్ టైంలో 'ఎలెవన్', 'బ్లైండ్ స్పాట్' లాంటి థ్రిల్లర్ సినిమాలతో అలరించాడు. ఇప్పుడు అదే జానర్‌లో చేసిన మరో చిత్రం 'షో టైమ్'. జూలై 4న థియేటర్లలో రిలీజైంది. కాకపోతే అదేరోజు నితిన్ 'తమ్ముడు' కూడా విడుదల కావడంతో దీనికి పెద్దగా బజ్ రాలేదు. థియేటర్లు దొరకలేదు. అలా ఒకటి రెండు రోజుల్లోనే మాయమైపోయింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జూలై 25 నుంచి సన్ నెక్స్ట్ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.
(ఇదీ చదవండి: 'హరిహర వీరమల్లు'.. ఏపీలో భారీగా టికెట్ రేట్ల పెంపు)
'షో టైమ్' విషయానికొస్తే.. ఓ ఇంటిలో రాత్రి 11 గంటలప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. సడన్‌గా అక్కడికి వచ్చిన సీఐ లక్ష‍్మీకాంత్(రాజా రవీంద్ర).. అర్థరాత్రి న్యూసెన్స్ ఏంటని వార్నింగ్ ఇస్తాడు. దీంతో సూర్య(నవీన్ చంద్ర), శాంతి(కామాక్షి).. సీఐ మధ్య వాగ్వాదం జరుగుతుంది. సీఐ ఏదైనా చేస్తాడేమో అని సూర్య భయపడుతున్న టైంలో ఓ సంఘటన జరుగుతుంది. స్టోరీ మలుపు తిరుగుతుంది. సూర్య-శాంతి ఓ కేసులో ఇరుక్కుంటారు. దీని నుంచి ఎలా బయడపడ్డారు. వీళ్లకు లాయర్ వరదరాజులు(వీకే నరేశ్) ఎలాంటి సాయం చేశాడనేదే మిగతా స్టోరీ.
ఈ కథంతా ఒక రోజులోనే జరుగుతుంది. సింపుల్ కథని అంతే క్లియర్‌గా దర్శకుడు ప్రెజెంట్ చేశాడు. 45 నిమిషాల్లోనే ఫస్టాప్ ముగించేసి.. సెకండాఫ్‌లో అసలు స్టోరీ మొదలుపెట్టాడు. ఎప్పుడైతే సీన్‌లో లాయర్‌గా నరేష్ ఎంటర్ అవుతాడో అక్కడి నుండి అదిరిపోయేలా నవ్వించాడు. అదే టైంలో స్టోరీలో సస్పెన్స్ కూడా బాగా మెంటైన్ చేశారు. సాధారణంగా ఇలాంటి మూవీస్ మలయాళంలో ఎక్కువగా వస్తుంటాయి. అలాంటిది ఒక గదిలోనే సినిమాని తీసేసిన మదన్.. దర్శకుడిగా మెప్పించాడు. సస్పెన్స్ కామెడీ మిక్స్ చేయడం బాగుంది. రాజా రవీంద్ర, నరేష్ మధ్యలో ఉండే ఎపిసోడ్ హైలెట్ అని చెప్పొచ్చు. క్లైమాక్స్ ఊహించిన దానికి భిన్నంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: ఒక్కరోజులోనే ఓటీటీలోకి వచ్చేసిన హిట్ సినిమా)
