హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త! | Hansika Motwani Husband Sohael Khaturiya put an End to Divorce Rumours | Sakshi
Sakshi News home page

Hansika Motwani: భర్తకు దూరంగా హన్సిక? తల్లింట్లోనే నివాసం! సోహెల్‌ ఏమన్నాడంటే?

Jul 19 2025 7:21 PM | Updated on Jul 19 2025 8:12 PM

Hansika Motwani Husband Sohael Khaturiya put an End to Divorce Rumours

నీకై నేను, నాకై నువ్వు ఉంటే చాలు కదా... అని పాటలు పాడుకునేవారు హన్సిక (Hansika Motwani)-సోహైల్‌ (Sohael Khaturiya). ఈ జోడీకి ఎవరి దిష్టి తగలకూడదు అనేలా ఒకరినొకరు అపురూపంగా చూసుకునేవారు. అలాంటిది.. వీరిద్దరూ విడిపోతున్నట్లు ప్రచారం మొదలైంది. జాతీయ మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం.. హన్సిక, సోహైల్‌ రెండేళ్లుగా విడివిడిగా నివసిస్తున్నారట! హన్సిక తన తల్లితో.. సోహైల్‌ అతడి పేరెంట్స్‌తో ఉంటున్నారని ప్రచారం జరుగుతోంది. 

విడివిడిగా..
అయితే విడాకుల రూమర్స్‌ గురించి సోహైల్‌ స్పందిస్తూ.. అందులో నిజం లేదని తేల్చిపారేశాడు. కానీ, వేర్వేరుగా జీవిస్తున్నారన్న అంశంపై మాత్రం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. కాగా హన్సిక- సోహైల్‌ 2022లో పెళ్లి చేసుకున్నారు. ప్రతి ఏడాది పెళ్లిరోజున స్పెషల్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుందీ హీరోయిన్‌. గతేడాది డిసెంబర్‌లో కూడా సెకండ్‌ యానివర్సరీ అంటూ ఓ పోస్ట్‌ పెట్టింది హన్సిక. దీన్ని బట్టి చూస్తే వీరు కలిసే ఉన్నారని తెలుస్తోంది. మరి తర్వాతేమైనా జరిగిందా? లేదా లేనిపోని రూమర్లు సృష్టిస్తున్నారా? అనే విషయంపై హన్సిక స్పందించాల్సి ఉంది.

సోహైల్‌కు రెండో పెళ్లి
ఇదిలా ఉంటే సోహైల్‌.. గతంలో హన్సిక చిన్ననాటి స్నేహితురాలు రింకీ బజాజ్‌ను పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి హన్సిక కూడా హాజరైంది. కానీ ఆ బంధం ఎంతోకాలం నిలవకపోవడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత సోహైల్‌తో కనెక్ట్‌ అయిన హన్సిక అతడిని వివాహం చేసుకుంది. జైపూర్‌లో జరిగిన ఈ పెళ్లి విశేషాలను లవ్‌ షాదీ డ్రామా వీడియో పేరిట ఓటీటీలోనూ రిలీజ్‌ చేశారు. అందులో హన్సిక.. సోహైల్‌ గతం గురించి చెప్తూ ఎమోషనలైంది. సోహైల్‌ గతం గురించి తెలుసు, కానీ.. అతడి విడాకులతో తనకు సంబంధం లేదని ఏడ్చేసింది.

చదవండి: గర్భంతో ఉన్నా యాక్షన్‌ సీన్స్‌.. మొదటిసారే మిస్‌క్యారేజ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement