ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన యాక్షన్ చిత్రం సలార్(పార్ట్ 1 – సీజ్‌ఫైర్). 2023లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేర్ చేసింది. ఖాన్సార్ అనే ప్రాంతం నేపథ్యంగా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఈ మూవీ హిట్ కావడంతో మేకర్స్ పార్ట్-2 కూడా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు.
అయితే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వస్తోన్న ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌పై కొద్ది రోజులుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ సోషల్ మీడియాలో వైరలైంది. దీంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అంతేకాకుండా సలార్ 2 స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చాలని ప్రశాంత్ నీల్, ప్రభాస్ నిర్ణయించారనే మరో టాక్ వినిపిస్తోంది. అందువల్లే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ వార్తలొచ్చాయి.
ఇలాంటి రూమర్స్ నేపథ్యంలో సలార్ టీమ్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రభాస్, శృతి హాసన్‌తో షూటింగ్ సమయంలో తీసిన స్టిల్‌ను విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌పై రూమర్స్ నిజం కాదని ఈ ఫోటోను షేర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌కు స్పష్టత ఇచ్చేశారు. శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పంచుకున్నారు. సలార్ 2లో తనకు ఏమి జరుగుతుందో దేవకు ఆద్య చూపిస్తోంది!! అది ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు?" అని క్యాప్షన్ కూడా రాసుకొచ్చారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. కాగా.. సలార్ పార్ట్ 2: శౌర్యాంగ పర్వం పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
Aadya showing Deva what happens to her in #Salaar2!!
What do you think it is? pic.twitter.com/lCSrbA0TSb— Salaar (@SalaarTheSaga) January 28, 2026


