breaking news
Nuvvostanante nenoddantana
-
ఈమెని గుర్తుపట్టారా? సిద్దార్థ్‌తో హిట్ సినిమా.. ఇప్పుడేమో ఇలా
కొందరు బ్యూటీస్ ఒకటి రెండు సినిమాలు చేసినా సరే మంచి గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటారు. ఈమె కూడా సేమ్ అలానే అనుకోవచ్చు. తమిళంలో చాలా మూవీస్ చేసినప్పటికీ తెలుగులో ఒకే ఒక్క మూవీతో ఫేమస్ అయింది. అందులో హీరో సిద్దార్థ్. మరి ఇన్ని హింట్స్ ఇచ్చాం కదా ఈ నటి ఎవరో కనిపెట్టారా? మమ్మల్ని చెప్పేయమంటారా?పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు నందిత జెన్నీఫర్. తండ్రి చిన్నా కొరియోగ్రాఫర్ కావడంతో ఈమె కూడా ఆయన అడుగుజాడల్లోనే నడిచింది. కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ఎంచుకుంది. 2000కి ముందు ఓ పక్క కొరియోగ్రఫీ చేస్తూనే మరోవైపు ఐటమ్ సాంగ్స్‌లోనూ అడపాదడపా మెరిసేది. అలా దర్శకుల దృష్టిలో పడి 'రిథమ్' అనే సినిమాతో నటిగా మారింది. అలా 2022 వరకు పలు చిత్రాల్లో నటించింది. తమిళంలో పలు రియాలిటీ షోల్లోనూ పాల్గొంది.(ఇదీ చదవండి: హన్సిక వైవాహిక బంధానికి బీటలు? ఒక్కమాటలో తేల్చేసిన భర్త!)దాదాపు తమిళ సినిమాలే చేసినా ఈమె.. సిద్దార్థ్ 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' సినిమాతో తెలుగులోకి పరిచయమైంది. డాలీ పాత్రలో తనదైన యాక్టింగ్ చేసి ఆకట్టుకుంది. మూవీ చూసినా ప్రతిసారి ఈమె పాత్ర కూడా నచ్చేస్తుంది. దీని తర్వాత పవిత్ర, వేర్ ఈజ్ విద్యాబాలన్, నా రూటే సెపరేట్ చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్‌లో కనిపించింది.జెన్నీఫర్ వ్యక్తిగత జీవితానికొస్తే.. 2007లో అసిస్టెంట్ సినిమాటోగ్రాఫర్ కాశీ విశ్వనాథన్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు ఇద్దరు కొడుకులు పుట్టారు. ప్రస్తుతం ఫ్యామిలీతో లైఫ్ ఎంజాయ్ చేస్తున్న ఈమె.. ఇన్ స్టాలోనూ యాక్టివ్గానే ఉంది. ఎప్పటికప్పుడు ఫొటోలు, రీల్స్ పోస్ట్ చేస్తూ ఉంది. అయితే అప్పట్లో సిద్ధార్థ్ సినిమాలో చూసినప్పటికీ ఇప్పటికీ ఈమెలో ఎంత మార్పు వచ్చేసింది. చాలామంది గుర్తుపట్టలేకపోతున్నారు కూడా!(ఇదీ చదవండి: డైరెక్టర్ క్రిష్ లేకుండానే 'హరిహర వీరమల్లు' మేకింగ్ వీడియో) View this post on Instagram A post shared by Jeni_Chinna (@jenniferr252) -
గీత స్మరణం
పల్లవి : పారిపోకే పిట్టా చేరనంటే ఎట్టా (2) అంత మారం ఏంటంటా మాట వినకుండా సరదాగా అడిగాగా మజిలీ చేర్చావా తీసుకుపో నీ వెంటా వస్తా తీసుకుపో నీ వెంటా... చరణం : 1 నా సంతోషాన్నంతా పంపించా తనవె ంటా భద్రంగానే ఉందా ఏ బెంగపడకుండా తన అందెలుగ తొడిగా నా చిందరవందర సరదా ఆడిస్తుందా లేదా సందడిగా రోజంతా చినబోయిందేమో చెలికొమ్మ ఆ గుండెల గూటికి ముందే కబురీయవే చిలకమ్మా నీవాడు వస్తాడే ప్రేమా అని త్వరగా వెళ్లి నువ్విన్న కథలన్నీ చెప్పమ్మా కాకమ్మా తీసుకుపో నీ వెంటా... వస్తా తీసుకుపో నీ వెంటా... హే... పుటుక్కు జరజర డుబుక్కుమే (2) చరణం : 2 ఆకలి కనిపించింది నిన్నెంతో నిందించింది అన్నం పెట్టను పోవే అని కసిరేశావంది నిద్దుర ఎదురయ్యింది తెగ చిరాగ్గా ఉన్నట్టుంది తన వద్దకు రావద్దంటూ తరిమేశావంటుంది ఏం గారం చేస్తావే ప్రేమా నువ్వడిగిందివ్వని వాళ్లంటూ ఎవరున్నారమ్మా ఆ సంగతి నీకు తెలుసమ్మా నీ పంతం ముందు ఏనాడు ఏ ఘనుడు నిలిచాడో చెప్పమ్మా తీసుకుపో నీ వెంటా... ఓ ప్రేమా తీసుకుపో నీ వెంటా... ॥ చిత్రం : నువ్వొస్తానంటే నేనొద్దంటానా (2005) రచన : సిరివెన్నెల, సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, గానం : మల్లికార్జున్, సాగర్ నిర్వహణ: నాగేశ్