షూటర్ ధనుష్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా | Dhanush Srikanth Wins Air Rifle Gold, Telnagana govenrment Announce Cash Prize | Sakshi
Sakshi News home page

షూటర్ ధనుష్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా

Nov 16 2025 5:03 PM | Updated on Nov 16 2025 5:14 PM

Dhanush Srikanth Wins Air Rifle Gold, Telnagana govenrment Announce Cash Prize

టోక్యో వేదికగా జరుగుతున్న డెఫ్లంపిక్స్‌లో హైదరాబాద్‌కు చెందిన షూటర్‌ ధనుష్‌ శ్రీకాంత్ అదరగొట్టాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో శ్రీకాంత్ స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. దనుష్ ఫైనల్లో 252.2 పాయింట్లతో అగ్రస్దానంలో నిలిచాడు. తద్వారా డెఫ్లంపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్లో అత్యధిక పాయింట్ల సాధించిన షూటర్‌గా శ్రీకాంత్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. సూరత్‌కు చెందిన మరో షూటర్‌ మహ్మద్ వానియా  250.1 పాయింట్లతో రజత పతకం సొంతం చేసుకున్నాడు. దీంతో రెండు పతకాలూ భారత్‌కే దక్కాయి.

భారీ నజరానా..
ఇక ఈ డెఫ్లంపిక్స్‌లో సత్తాచాటిన ధనుష్‌ శ్రీకాంత్‌కు తెలంగాణ సర్కార్ భారీ నజరానా ప్రకటించింది. స్పోర్ట్స్ పాలసీ ప్రకారం కోటి 20 లక్షలు రూపాయల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు మంత్రి వాకిటి శ్రీహరి ప్రకటించారు. ఆదివారం (నవంబర్ 16) హన్మకొండ స్పోర్ట్స్ స్కూల్ ప్రారంభంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
చదవండి: సంతోషంగా ఉన్నాను.. మా ఓటమికి కారణం వారే: గంభీర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement