టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. కంచు కనకమాలక్ష్మి అప్‌డేట్‌! | Tollywood Movie Kanchu Kanakamalakshmi Shoot Begines Today | Sakshi
Sakshi News home page

Kanchu Kanakamalakshmi: టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్‌.. కంచు కనకమాలక్ష్మి అప్‌డేట్‌!

Oct 2 2025 8:30 PM | Updated on Oct 2 2025 8:30 PM

Tollywood Movie Kanchu Kanakamalakshmi Shoot Begines Today

మల్లిక శంకర్ , కిషోర్ రావు, గౌతమ్ నంద, అమిత శ్రీ, హీరో హీరోయిన్లుగా ఎంట్రీ ఇస్తోన్న చిత్రం 'కంచు కనకమాలక్ష్మి'. ఈ సినిమాను గణేష్ అగస్త్య దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. యువన్ టూరింగ్ టాకీస్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు. తాజాగా ఇవాళ దసరాకు క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్.

విజయ దశమి సందర్భంగా ఈ మూవీ షూటింగ్‌ను గ్రాండ్‌గా ప్రారంభించారు. పాటల రికార్డింగ్‌తో పాటు చిత్రీకరణ మొదలెట్టారు. ఈ చిత్రానికి అజయ్ పట్నాయక్ సంగీతం అందిస్తున్నారు. కాగా.. ఈ మూవీని వీరేంద్రనాథ్ కోలుకుల, భరత్ అట్లూరి, బృందకర్ గౌడ్ ,రాజేష్ గంగునాయుని, గణపతి నాయుడు సీర, కొండల రావు చూక్కాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

o

ఈ సందర్భంగా దర్శకుడు గణేష్ అగస్త్య మాట్లాడుతూ.."ఇది క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. అందరికీ కంచు కనకమాలక్ష్మి స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చుతుంది. విజయదశమి నాడు అజయ్ పట్నాయక్ సంగీత దర్శకత్వంలో పాటల రికార్డింగ్‌తో మొదలుపెట్టాం. ఈ నెల 10 నుంచి రెగ్యులర్ షూటింగ్‌కు వెళ్తున్నాం. విజయనగరం, పట్టిసీమ, అరకు పరిసర ప్రాంతాల్లో 28 రోజులు  షెడ్యూల్ ప్లాన్ చేశాం. ఆ తరువాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూట్ చేస్తామని' వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement