
అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. నార్త్ కరోలినాలో ఒక రెస్టారెంట్ వద్ద ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. బోటులో వచ్చి జనంపై విరుచుకుపడ్డాడు. విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. ఈఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
North Carolina shooter opens FIRE from a boat
Gunfire tears into restaurant — reports of 7 victims
Suspect takes off by boat & remains at large https://t.co/Y5rvJl2PWS pic.twitter.com/B3rPl1BbS4— RT (@RT_com) September 28, 2025
విల్మింగ్టన్‌కు సమీపంలోని సౌత్‌పోర్ట్ యాట్ బేసిన్ ప్రాంతంలో ఉన్న ‘అమెరికన్ ఫిష్ కంపెనీ’ అనే రెస్టారెంట్‌లో శనివారం రాత్రి 9:30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ సమీపంలో బోటులు వచ్చిన వ్యక్తి ఒక్కసారిగా తుపాకీతో జనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఏడుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అనంతరం అదే బోటులో పరారయ్యాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కాల్పుల ఘటనను సిటీ మేనేజర్ నోవా సాల్డో ధ్రువీకరించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాధితులను స్థానిక ఆసుపత్రులకు తరలించారు. అయితే మృతుల వివరాలను, గాయపడిన పరిస్థితుల గురించి వివరాలను అధికారులు ఇంకా విడుదల చేయలేదు.
స్థానికులు సంఘటనా ప్రాంతానికి దూరంగా ఉండాలని, సౌత్‌పోర్ట్ ప్రాంతానికి ఎవరూ రావొద్దని, ఇంటి లోపలే ఉండాలని మరియు ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే వెంటనే 911కు నివేదించాలని పోలిసులు కోరారు. బ్రున్స్విక్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం, సౌత్‌పోర్ట్ పోలీస డిపార్ట్‌మెంట్‌కు సహాయం అందిస్తోంది. నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేశాయి.
— TheBlaze (@theblaze) September 28, 2025