
న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా అలజడి రేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా.. వారిలో ఒక యువతి ఉన్నారు. వారిని బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు.
నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో గన్ క్రైమ్ తగ్గుతోందన్న పోలీస్ కమిషనర్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్‌కు అమాయకులు బలైపోతున్నారు. గత నెల జులై 29న న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఆఫీస్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్‌వైపీడీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.
@bufocalvin
A teenager opens fire in the middle of Times Square (New York City) and injures three people... pic.twitter.com/w7zD4DX3vD— patomareao (@patomareao81945) August 9, 2025
మరో ఘటనలో మే 27న ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్ పార్క్ కాల్పులు కారణంగా ఇద్దరు మైనర్లు మృతి చెందారుజ ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండగా.. రాత్రి 10:30 సమయంలో కాల్పులు జరిగాయి.