breaking news
New York City Police
-
వీడియో వైరల్: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం
న్యూయార్క్‌లోని ప్రసిద్ధ టైమ్స్ స్క్వేర్‌లో కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ముగ్గురు గాయపడ్డారు. కాల్పులతో ఒక్కసారిగా అలజడి రేగడంతో జనం భయంతో పరుగులు తీశారు. అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 17 ఏళ్ల యువకుడు కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ముగ్గురు గాయపడగా.. వారిలో ఒక యువతి ఉన్నారు. వారిని బెల్లెవ్యూ ఆసుపత్రికి తరలించారు.నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.అతడి వద్ద నుంచి ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాగా, ఈ ఘటనలో ప్రజలు భయంతో పరుగులు తీస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలో గన్ క్రైమ్ తగ్గుతోందన్న పోలీస్ కమిషనర్ ప్రకటించిన కొద్దిరోజుల్లోనే ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.ఈ ఘటనలు అమెరికాలో గన్ కల్చర్‌కు అమాయకులు బలైపోతున్నారు. గత నెల జులై 29న న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్ ఆఫీస్ భవనంలో జరిగిన కాల్పుల్లో ఐదుగురు మృతి చెందారు. ఎన్‌వైపీడీ అధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.@bufocalvinA teenager opens fire in the middle of Times Square (New York City) and injures three people... pic.twitter.com/w7zD4DX3vD— patomareao (@patomareao81945) August 9, 2025మరో ఘటనలో మే 27న ఫిలడెల్ఫియాలోని ఫెయిర్‌మౌంట్ పార్క్ కాల్పులు కారణంగా ఇద్దరు మైనర్లు మృతి చెందారుజ ఈ ఘటనలో 8 మంది గాయపడ్డారు. మెమోరియల్ డే సందర్భంగా జనసంచారం ఎక్కువగా ఉండగా.. రాత్రి 10:30 సమయంలో కాల్పులు జరిగాయి. -
NewYork: టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం
న్యూయార్క్: అమెరికా న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద బాంబు కలకలం రేగింది. దీంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని మొత్తం బ్లాక్ చేసి బాంబు స్వ్కాడ్‌తో తనిఖీలు చేపట్టారు. శనివారం టైమ్స్ స్క్వేర్ నుంచి ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పాలస్తీనా మద్దతుదారులు ఒక ర్యాలీ తీశారు. ఈ ర్యాలీ సమయంలో అటుగా వచ్చిన అక్కడికి వచ్చిన క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడిని దించిన వెంటనే తన కారు వెనుక సీటులో గ్రెనేడ్‌ను గమనించాడు. దీంతో వెంటనే అతడు పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకుని క్యాబ్ ఉన్న ప్రదేశానికి వస్తున్న బాంబ్ స్క్వాడ్ ఎమర్జెన్సీ వాహనాన్ని ర్యాలీ చేస్తున్న వారు అడ్డుకున్నారు. దీంతో బాంబ్ స్క్వాడ్ వాహనం గ్రెనేడ్ వద్ద ఉన్న క్యాబ్ వద్దకు వచ్చేసరికి ఆలస్యమైంది. చివరకు అక్కడకు చేరుకున్న పోలీసులు గ్రెనేడ్ నిర్వీర్యమైనదేనని తేల్చారు. బాంబ్ స్క్వాడ్ వాహనాన్ని అడ్డుకున్న వారికి జైలు తప్పదని పోలీసులు ఎక్స్(ట్విటర్)లో పోస్టు చేశారు. ఇదీ చదవండి.. ఐఎస్ఎస్కు వ్యోమగాముల ప్రయాణం వాయిదా -
న్యూయర్క్ పోలీస్ డిపార్ట్మెంట్లో పాకిస్థాన్ వాసి
ఇస్లామాబాద్: న్యూయార్క్ పోలీస్ డిపార్ట్మెంట్కు తొలిసారి పాకిస్థాన్‌వాసి అలీ జావెద్ అనే వ్యక్తి ఎంపికయ్యాడు. డిపార్ట్మెంట్లో చేరిన మెదటి ముస్లింగానే కాదు పాకిస్థాన్ వాసిగా జావెద్ రికార్డు నమోదు చేశాడు. జావెద్ న్యూయార్క్ సిటీ పోలీస్ ఎమర్జెన్సీ విభాగానికి సర్జెంట్గా ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని ముస్లిం ఆర్గనైజషేన్ శుక్రవారం ట్విటర్లో పేర్కొంది. ‘న్యూయర్క్ పోలీస్ విభాగానికి ఎంపికైన తొలి ముస్లింగా, పాకిస్థాన్ వాసిగా జావేద్ చరిత్ర సృష్టించాడని’,ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ను డాన్ పత్రిక శుక్రవారం ప్రచురించింది. ఇస్లామాబాద్ యూఎస్ ఎంబసీ జావేద్‌కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేసింది. -
ఎవరు నువ్వు అంటుండగానే పోలీసును కాల్చేశాడు
న్యూయార్క్: ఎవరు నువ్వు? ఇక్కడేం చేస్తున్నావ్ అని ప్రశ్నించినందుకు ఓ పోలీస్ ఆఫీసర్‌పై కాల్పులు జరిగిన ఘటన అమెరికాలో చోటుచేసుకుంది. పోలీస్ అధికారి తలపై కాల్పులు జరపడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించి ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. న్యూయార్క్ సిటీలో బ్రియాన్ మోర్ (25) అనే పోలీసు అధికారి శనివారం విధుల్లో భాగంగా గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో ఆయన తన గస్తీ వాహనాన్ని నిలిపేసి అతడిని ప్రశ్నిస్తుండగా ఒక్కసారిగా ఆ వ్యక్తి తుపాకీ తీసి బ్రియాన్ తలపై గురిపెట్టి కాల్చాడు. ప్రస్తుతం బ్రియాన్‌కు జమైకా ఆస్పత్రిలో ఓ శస్త్ర చికిత్స పూర్తి చేశారు. అయితే, పరిస్థితి మాత్రం చాలా తీవ్రంగా ఉందని వైద్యులు చెప్తున్నారు.