నిజామాబాద్: జిల్లాలోని ఇందల్వాయిలో కాల్పుల కలకలం చోటు చేసుకుంది. పాతకక్షల కారణమా.. లేక వేరే ఏ కారణాలో కానీ లారీడ్రైవర్ సల్మాన్‌పై కొంతమంది దుండగులు కాల్పులకు దిగారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సల్మాన్ మృతిచెందాడు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, కాల్పుల కలకలం అనేది తెలుగు రాష్ట్రాల్లోని జిల్లాల్లో కూడా చోటు చేసుకోవడం ఆందోళన రేకెత్తిస్తోంది.


