అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి | 4 Killed In Shooting At New York Manhattan Office Building, Check More Details Inside | Sakshi
Sakshi News home page

అమెరికాలో కాల్పుల కలకలం.. ఐదుగురు మృతి

Jul 29 2025 7:13 AM | Updated on Jul 29 2025 10:05 AM

4 Killed in Shooting at Manhattan Office Building

వాషింగ్టన్: అమెరికాలో కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్ సెంట్రల్ మాన్‌హట్టన్‌లో  జరిగిన ఈ కాల్పుల ఘటనలో న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారితో సహా  ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది. సీఎన్‌ఎస్‌ నివేదిక ప్రకారం కాల్పులు జరిపిన వ్యక్తిని లాస్ వెగాస్‌కు చెందిన 27 ఏళ్ల షేన్ తమురాగా  పోలీసులు గుర్తించారు. నిందితుడు కూడా గాయాలతో మృతిచెందాడని పోలీసులు తెలిపారు.

గ్రాండ్ సెంట్రల్ స్టేషన్, రాక్‌ఫెల్లర్ సెంటర్, మ్యూజియం ఆఫ్ మోడరన్ ఆర్ట్‌లకు సమీపంలోని మిడ్‌టౌన్ మాన్‌హట్టన్‌లోని రద్దీగా ఉండే ప్రాంతంలోని ఒక భవనంపైకి కాల్పులు జరిపారు. దీంతో ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ విధించారు. ఈ ప్రాంతంలో పలు ఫైవ్ స్టార్ హోటళ్లు, కోల్గేట్-పామోలివ్, ఆడిటింగ్ సంస్థ కేపీఎంజీతో సహా పలు కార్పొరేట్ సంస్థల ప్రధాన కార్యాలయాలన్నాయి. మేయర్ ఎరిక్ ఆడమ్స్ తన ‘ఎక్స్‌’ ఖాతాలో ఈ దాడిపై విచారం వ్యక్తం చేశారు. పోలీసు అధికారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.

పోలీసులు ‘ఎక్స్‌’లో పార్క్ అవెన్యూలో జరిగిన ఘటనలో నిందితుడు మృతి చెందాడని, అతని వివరాలు తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.  ఘటన జరిగిన అనంతరం ఆ స్థలాన్ని తమ స్వాధీనంలోనికి తీసుకున్నామని, ఒంటరి షూటర్‌ను చుట్టుముట్టామని పోలీసు కమిషనర్ జెస్సికా టిష్ ‘ఎక్స్‌’ లో రాశారు. ఫాక్స్ న్యూస్ తెలిపిన వివరాల ప్రకారం ఈ ఘటనలో ఒక పోలీసు అధికారితో సహా కనీసం ఆరుగురిపై కాల్పులు జరిగాయని, ఆ అధికారి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొంది. సాయంత్రం రద్దీ సమయంలో పార్క్ అవెన్యూ సమీపంలో అధికారులు ఉన్న సమయంలో కొందరు సాయుధులు, బాలిస్టిక్ షర్టులను ధరించి కాల్పులు జరిపారని సమాచారం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement