మెల్‌బోర్న్: ఆస్ట్రేలియాలో కాల్పుల కలకలం రేగింది. న్యూసౌత్ వేల్స్‌లోని లేక్ కార్గెల్లిగో పట్టణంలో దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. కాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మరణించారు. ఒకరు గాయపడ్డారు. బాండీ బీచ్ దాడి ఘటన జరిగిన నెల రోజులకే ఈ ఘటన చోటు చేసుకుంది. సుమారు 1500 మంది జనాభా ఉన్న ఈ పట్టణంలోని వాల్కర్ వీధిలోని ఒక నివాస ప్రాంతంలో సాయంత్రం 4.40 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని సెంట్రల్ వెస్ట్ పోలీస్ డిస్ట్రిక్ట్ అధికారులు వెల్లడించారు.
తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలించగా.. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాల్పులు జరిపిన దుండగులు పరారీలో ఉండటంతో.. ప్రజలను ఆ ప్రాంతానికి వెళ్లవద్దని పోలీసులు హెచ్చరించారు. పోలీస్ ఆపరేషన్ కొనసాగుతున్నందున స్థానికులు ఇళ్లలోనే ఉండాలని పోలీస్ అధికారులు సూచించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిస్తే సెంట్రల్ వెస్ట్ పోలీస్, క్రైమ్ స్టాపర్స్ (1800 333 000) నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.
UPDATE: Police have commenced an investigation following reports of a shooting where three people have died at Lake Cargelligo this afternoon.
About 4.40pm, emergency services were called to Walker Street, near Yelkin Street, Lake Cargelligo, following reports of a shooting.… https://t.co/XCvCpkL9Qz— NSW Police Force (@nswpolice) January 22, 2026


