
దుల్కర్ సల్మాన్‌ని ద్విచక్ర వాహనంపై కూర్చోబెట్టుకుని రయ్ రయ్‌మంటూ పూజా హెగ్డే బండి నడిపారు. ఇద్దరూ ఎలా చిరునవ్వులు చిందించారో ఇక్కడున్న ఫొటోలో చూడొచ్చు. దుల్కర్ సల్మాన్, పూజా హెగ్డే హీరో హీరోయిన్‌గా ఓ ప్రేమకథా చిత్రం షురూ అయింది. రవి నెలకుదిటి దర్శకునిగా పరిచయం చేస్తూ సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.
ఈ చిత్రంలో పూజా హెగ్డేని కథానాయికగా ప్రకటించి, బుధవారం ఆమె షూట్‌లో పాల్గొన్న విషయాన్ని చిత్రబృందం తెలియ జేసింది. ‘‘రవి నెలకుదిటి చక్కని ప్రేమకథ రాశారు. ఈ కథలో మంచి హ్యూమన్ డ్రామా, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలు ఉన్నాయి’’ అని కూడా యూనిట్ పేర్కొంది. పాన్–ఇండియా మూవీగా ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాశ్‌కుమార్, కెమెరా: అనయ్ ఓం గోస్వామి.