
రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న చిత్రం ది రాజా సాబ్. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా.. అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. మారుతి-ప్రభాస్ కాంబోలో తెరకెక్కిస్తోన్న హారర్ రొమాంటిక్ కామెడీ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది.
ఇకపోతే ది రాజా సాబ్ చిత్రంలో రెండు పాటల చిత్రీకరణ పెండింగ్‌లో ఉంది. ఈ స్పెషల్ సాంగ్స్ షూటింగ్ చేసేందుకు రాజా సాబ్ టీమ్ యూరప్‌కు బయలుదేరింది. దీనికి సంబంధించిన ఫోటోలను నిర్మాత ఎస్‌కేఎన్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. డైరెక్టర్ మారుతితో ఫ్లైట్‌లో ఉన్న పిక్‌ను పోస్ట్ చేశారు. ఈ సాంగ్స్‌ను షూట్ చేసేందుకు చిత్రబృందం యూరప్‌కు పయనమయ్యారు.

కాగా.. మారుతి దర్శకత్వం వహించిన 'ది రాజా సాబ్' చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో నిర్మించారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్, బోమన్ ఇరానీ ముఖ్య పాత్రలు పోషించారు. కల్కి తర్వాత వస్తోన్న ప్రభాస్ మూవీ కావడంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.