షూటింగ్‌లో భారత్‌కు 20వ ఒలింపిక్‌ బెర్త్‌   | 20th Olympic berth for India in shooting | Sakshi
Sakshi News home page

షూటింగ్‌లో భారత్‌కు 20వ ఒలింపిక్‌ బెర్త్‌  

Apr 15 2024 2:40 AM | Updated on Apr 15 2024 2:40 AM

20th Olympic berth for India in shooting - Sakshi

పారిస్‌ ఒలింపిక్స్‌ షూటింగ్‌ ఈవెంట్‌లో భారత్‌కు 20 బెర్త్‌ ఖరారైంది. రియో డి జనీరోలో జరుగుతున్న చివరి ఒలింపిక్‌ క్వాలిఫయింగ్‌ టోర్నీలో మహిళల 10 మీటర్ల ఎయిర్‌ పిస్టల్‌ ఈవెంట్‌లో భారత షూటర్‌ పలక్‌ గులియా కాంస్య పతకం సాధించింది.

తద్వారా భారత్‌కు ఒలింపిక్‌ బెర్త్‌ను అందించింది. ఎనిమిది మంది షూటర్లు పోటీపడ్డ ఫైనల్లో ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత, 18 ఏళ్ల హరియాణా అమ్మాయి పలక్‌ 217.6 పాయింట్లతో మూడో స్థానాన్ని దక్కించుకుంది. భారత్‌కే చెందిన మరో షూటర్‌ సంయమ్‌ 176.7 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది.   

Advertisement
 
Advertisement
Advertisement