పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే.. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్‌కు ముప్పు తలపెట్టడంపైనే ఉందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపి.. అతడికి విరోధి అయిన అసీమ్ మునీర్‌కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్‌షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్‌లో పాకిస్థాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
జమ్ముకశ్మీర్, లడఖ్ భారతదేశానికి విడదీయరాని భాగాలు. వాటిపై పాకిస్థాన్‌కి ఎలాంటి హక్కు లేదు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారి.. గత దశాబ్దాలుగా భారత్‌పై ఉగ్రదాడులు జరిపింది. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి.. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని అన్నారాయన.
అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టింది. ఇది ఆ దేశపు ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ప్రత్యేక పద్ధతి అని హరీశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రతినిధులు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది.
VIDEO | New York: Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish (@AmbHarishP), delivered India's statement at the Open Debate on ‘Leadership for Peace’ in the UN Security Council.
"India had entered into the Indus Waters Treaty, 65 years ago, in… pic.twitter.com/hMRWESj0xQ— Press Trust of India (@PTI_News) December 16, 2025


