కాసాబ్లాంకా: మొరాకోలోని తీరప్రాంత నగరం సాఫిలో ఆదివారం రాత్రి సంభవించిన భారీ వర్షం, ఆకస్మిక వరదలతో కనీసం 37 మంది ప్రాణాలు కోల్పోయారు. నగరంలోని 70 నివాసాలు, వ్యాపార సంస్థలు నీట మునిగాయి.
పది వాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. దీంతో, నగర యంత్రాంగం స్కూళ్లకు మూడు రోజులు సెలవు ప్రకటించింది. దేశంలోని టౌటొవాన్, టింఘిర్ తదితర నగరాలు సహా ఇతర ప్రాంతాల్లో సైతం వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా నష్టం సంభవించింది.


