Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం | Private jet crashes in Mexico | Sakshi
Sakshi News home page

Mexico: కూలిన ప్రైవేట్ జెట్.. పదిమంది సజీవ దహనం

Dec 16 2025 7:22 AM | Updated on Dec 16 2025 10:29 AM

Private jet crashes in Mexico

మెక్సికో సిటీ: సెంట్రల్ మెక్సికోలో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఒక ప్రైవేట్ జెట్ అత్యవసర ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తుండగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో పదిమంది సజీవ దహనమయ్యారు. మెక్సికో రాష్ట్ర పౌర రక్షణ సమన్వయకర్త అడ్రియన్ హెర్నాండెజ్ ఈ ప్రమాదాన్ని ధృవీకరించారు. ఈ విమానం మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో (Acapulco) నుండి బయలుదేరింది. 
 

ఈ ప్రమాదం టోలుకా విమానాశ్రయానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న పారిశ్రామిక ప్రాంతమైన శాన్ మాటియో అటెన్కోలో జరిగింది. ప్రైవేట్ జెట్ ఒక ఫుట్‌బాల్ మైదానంలో అత్యవసరంగా ల్యాండ్ కావడానికి ప్రయత్నిస్తుండగా, సమీపంలోని ఫ్యాక్టరీ పైకప్పును ఢీకొట్టడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని హెర్నాండెజ్ తెలిపారు. జెట్ ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగాయి. ఘటన జరిగిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు.  

పరిసర ప్రాంతం నుండి దాదాపు 130 మందిని ఖాళీ చేయించారని శాన్ మాటియో అటెన్కో మేయర్ అనా మునిజ్ మిలేనియో టెలివిజన్‌తో అన్నారు. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నదని అధికారులు ప్రకటించారు. ఈ విమాన ప్రమాదం స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురి చేసింది. ఈ ప్రమాదం వెనుకగల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తు సంస్థలు  రంగంలోకి దిగాయి.

ఇది కూడా చదవండి: రన్నింగ్ ట్రాక్‌ కాదది.. రూ.449 కోట్ల ఫ్లైఓవర్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement