తెలుగులో ఇప్పటివరకు చాలా హారర్ సినిమాలు వచ్చాయి. దాదాపుగా ప్రతిదానిలోనూ పెద్దవాళ్లు లేదంటే ఓ వయసు ఉండే పిల్లలు చనిపోయి దెయ్యాలుగా మారడం చూస్తుంటాం. కానీ 9 నెలల పిల్లాడు దెయ్యమై పగ తీర్చుకుంటే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్‌తో టాలీవుడ్‌లో ఓ మూవీ తీస్తున్నారు. అదే 'నెపోలియన్ రిటర్న్స్'. గతంలో నీడ పోయింది సర్ అనే స్టోరీతో మూవీ తీసిన ఆనంద్ రవి అనే దర్శకుడు.. ఇప్పుడు ఈ మూవీతో వస్తున్నాడు.
(ఇదీ చదవండి: పిల్లలతో తీసిన హారర్ సినిమా.. వాళ్లు చూడకపోవడమే బెటర్!)
దర్శకత్వం వహించడంతో పాటు హీరోగానూ ఆనంద్ రవి నటిస్తున్నాడు. ఆటో రాంప్రసాద్, దివి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ప్రస్తుతానికైతే గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో గేదె దెయ్యం వచ్చింది, నన్ను పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ చేయమంది అనే డైలాగ్స్ చెప్పారు. కానీ ఆదివారం జరిగిన ఈవెంట్‌లో దర్శకహీరో ఆనంద్ రవి మాట్లాడుతూ.. మెయిన్ ప్లాట్ ఏంటో చెప్పాడు. 9 నెలల వయసు అంటే సరిగా నిలబడం, నడవడమే రాదు. అలాంటిది పిల్లాడు దెయ్యంగా మారి పగ తీర్చుకోవడం అనే పాయింట్ బాగానే ఉంది. కానీ దాన్ని ప్రెజెంట్ చేస్తారో చూడాలి?
(ఇదీ చదవండి: కొద్దిరోజులుగా మాస్క్‌తోనే రష్మిక.. కారణం ఇదేనా..?)


