గుండె చప్పుడు వినే స్టెతస్కోప్‌.. ఎలా పుట్టింది? | Do You know The History And Evolution Of The Stethoscope, How A Simple Idea Revolutionized Medicine | Sakshi
Sakshi News home page

గుండె చప్పుడు వినే స్టెతస్కోప్‌.. ఎలా పుట్టింది?

Nov 29 2025 7:55 AM | Updated on Nov 29 2025 11:18 AM

Do You know The History and Evolution of the Stethoscope

పిల్లలూ! మీరు హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు డాక్టర్లను చూసే ఉంటారు కదా! తెల్లకోటులో ఉండే డాక్టర్ల మెడలో స్టెతస్కోప్‌ వేలాడుతూ ఉంటుంది. వైద్యులు దాన్ని మీ గుండెపై పెట్టి, మీ గుండె చప్పుడు వింటారు. ఆ తర్వాత మీ సమస్య తెలుసుకొని మందులు రాసిస్తారు. చూసేందుకు ఆ స్టెతస్కోప్‌ చాలా ముచ్చటగా ఉంటుంది. అసలది ఎప్పుడు పుట్టిందో, దాని వల్ల ప్రయోజనాలేమిటో తెలుసా?

స్టెతస్కోప్‌ని మొట్టమొదటిసారిగా 1816లో కనుక్కున్నారు. ఫ్రాన్స్‌కు చెందిన రెన్‌ లానెక్‌ అనే వైద్యుడు దీనికి రూపకల్పన చేశారు. ఆయనకు దీన్ని తయారు చేయాలన్న ఆలోచన ఎందుకొచ్చిందో తెలుసా? స్టెతస్కోప్‌ లేని కాలంలో రోగుల గుండె పరిస్థితిని తెలుసుకునేందుకు వైద్యులు తమ చెవిని వారి గుండె మీద పెట్టేవారు. ఎన్నో ఏళ్లు ఇదే పద్ధతి కొనసాగింది. అయితే కొందరు పేషంట్లకు ఇది ఇబ్బందికరంగా, మొహమాటంగా ఉండేది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలని ఆలోచించిన డాక్టర్‌ లానెక్‌ తొలి స్టెతస్కోప్‌ని తయారు చేశారు. 

ఇదీ చదవండి: పాతికేళ్లకే యంగెస్ట్‌ బిలియనీర్‌.. అమన్‌ అంటే అమేయ ప్రతిభ

అయితే ప్రస్తుతం మనం చూసే స్టెతస్కోప్‌లకూ ఆయన తయారు చేసిన దానికీ చాలా తేడా ఉంది. మొదట్లో ఒక ట్యూబ్‌ సాయంతో దీన్ని తయారు చేశారు. అనంతరం కొంతకాలానికి అందులో మరిన్ని మార్పులు చేసి ప్రస్తుతం మనం చూసే స్టెతస్కోప్‌ని రూపొందించారు. ప్రస్తుతం ఉన్న స్టెతస్కోప్‌లు గుండె చప్పుడు స్పష్టంగా వినేందుకు తోడ్పడుతున్నాయి. దీనివల్ల రోగుల ఆరోగ్య స్థితి తెలుసుకోవడం వైద్యులకు సులువవుతుంది. 

ఇదీ చదవండి: రూ. 300తో ఇంటినుంచి పారిపోయి...ఇపుడు రూ. 300 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement