రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15మంది మృతి | Plane crashes on road in Bolivia | Sakshi
Sakshi News home page

రోడ్డుపై కుప్పకూలిన విమానం.. 15మంది మృతి

Feb 28 2026 7:05 AM | Updated on Feb 28 2026 9:37 AM

Plane crashes on road in Bolivia

బొలీవియాలో విషాదం చోటు చేసుకుంది.  బ్యాంకు కరెన్సీ నోట్లతో బయిలుదేరిన ఓ విమానం  అక్కడి రాజధాని సమీపంలోని ఎల్‌ అల్టో నగరం వద్ద రోడ్డుపై కూలిపోయింది. ఈ దుర్ఘటనలో 15 మంది మృతిచెందారు. 30 మందికి పైగా ప్రజలు గాయపడ్డట్లు తెలుస్తోంది.

నిన్న (శుక్రవారం) సాయంత్రం శాంటా క్రూజ్ నగరం నుంచి బయిలుదేరిన ఓ మిలటరీ విమానం బయిలుదేరింది. అందులో ఆదేశంలో నూతనంగా  ముద్రించిన కరెన్సీ నోట్లను తీసుకెళుతున్నారు.  అయితే ప్రమాదవశాత్తు  ఎల్‌ అల్టో నగరంలోని రోడ్డుపై కూలిపోయింది. దీంతో భారీగా వాహనాలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాద ఘటనలో 15 మంది మృతిచెందారు. 30 మందికి పైగా గాయలయ్యాయి.  

అయితే ఫ్లైట్ కూలిన సందర్భంలో కరెన్సీ నోట్లను ఏరుకోవడానికి పెద్దఎత్తున ప్రజలు గూమిగూడారు. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి.  దీంతో భద్రతా బలగాలు టియర్ గ్యాస్ ప్రయోగించి వారిని చెదరగొట్టే యత్నం చేశారు. అనంతరం  అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను ఆర్పే యత్నం చేశాయి. వాతావరణ పరిస్థితులు అనూకూలించకనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement